Header Ads

కుక్కలకు బారసాల ఎలా చేసారు వీడియో చూడండి

సిద్దిపేట జిల్లాలో ఓ కుటుంబం తాము పెంచుకుంటున్న కుక్కకు పుట్టిన కుక్క పిల్లలకు ఘనంగా బారసాల నిర్వహించింది. జిల్లాలోని దుబ్బాకలో సారంపల్లి దేవవ్వ అనే మహిళ ఒక శునకాన్ని అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. ఆ కుక్క ఈ మధ్యే ఏడు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. మనుషుల లాగే వాటికి కూడా బారసాల చేయాలని నిర్ణయించుకుంది దేవవ్వ. వెంటనే కుక్క పిల్లలన్నింటికీ బట్టలు కుట్టించింది. బారసాల రోజు ఇంటి పక్కనవాళ్లందర్నీ పిలిచి, కుక్కలకు బొట్టు పెట్టి బట్టలు తొడిగింది. ఆ తర్వాత కుక్కపిల్లలన్నింటినీ ఉయ్యాలలో వేసి ఊపుతూ పాటలు కూడా పాడారు ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులు.

వీడియో లింక్ : https://www.facebook.com/News18Telugu/videos/689475064818538/?v=689475064818538
అంతే కాదు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();