ఇతడిని చూస్తే రాముడు కట్టిన వారధి గుర్తుకు వస్తుది
తోటి రైతుల సాయంతో రంగంలోకి దిగాడు గంగారాం. వంతెన నిర్మించడానికి అందుబాటులో ఉన్న వనరులు సేకరించారు. వృథాగా ఉన్న విద్యుత్ తీగలను కొనుగోలు చేశారు. సిమెంట్ స్తంభాలు, ఇనుప రాడ్లు, దృఢమైన కర్రలు, ఇనుప రేకులను తీసుకున్నారు. తొలుత వంద మీటర్ల వెడల్పున్న వాగుకు ఇరువైపులా పిల్లర్లు ఏర్పాటు చేసి విద్యుత్ తీగలను లాగారు. తీగలకు ఆసరాగా వాగులో కర్రలతో, ఇనుప స్తంభాలతో పిల్లర్లు ఏర్పాటు చేశారు. చివరగా పిల్లర్ల మధ్య తీగలు లాగి.. వాటిపై రేకులను పరిచారు. ఈ వారధి కట్టి పుష్కర కాలం దాటిపోయింది. 2006లో నిర్మించిన వంతెన.. ఇన్నేళ్లలో ఎన్ని వరదలు వచ్చినా తట్టుకొని నిలబడింది. ఎందరో రైతులకు పొలం బాటయింది. 'ఈ రాముడే పూనుకోకపోతే.. మా కష్టాలు నేటికీ తీరేవి కావ'ని అంటారు కడు గ్రామ రైతులు.ఆదిలాబాద్ జిల్లా బేల మండలం మణియపూర్ గ్రామవాసి కడు గంగారాం. ఊరి పొలిమేరలోనే పదెకరాల పొలం ఉంది. వాగు పక్కనున్న చేలు. నీటి వనరులున్న నేల కావడంతో బంగారం పండుతుంది. కనుచూపుమేరలో ఉన్న పొలానికి వెళ్లాలన్నా.. వెంటనే సాధ్యమయ్యేది కాదు. ఆరు కిలోమీటర్లు నడవాల్సిందే. మధ్యలో వాగు అడ్డుగా ఉండటంతో చుట్టూ తిరిగి చేలకు వెళ్లాల్సి వచ్చేది.
Post a Comment