Header Ads

ఈ కుక్క సాహసానికి సలామ్ అంటారు

అడవిపులి బారి నుంచి ఓ కుక్క యజమానిని కాపాడి విశ్వాసాన్ని చాటుకుంది. మధ్యప్రదేశ్‌లోని సివనీ జిల్లా పరస్‌పని గ్రామానికి సమీపాన గల అడవిలో శనివారం ఉదయం ఈ సంఘటన జరిగిందని డివిజినల్‌ అటవీ అధికారి టి.ఎస్‌.సులియా తెలిపారు. పంచమ్‌ గజ్బా(22) అనే యువకుడు తన సోదరుడితో కలసి స్థానిక అడవి వద్దకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. చెట్టు కొమ్మను గజ్బా విరుస్తుండగా పొదల్లో దాగి ఉన్న పులి ఒక్కసారిగా దాడి చేసింది. అతని సోదరుడు అక్కడే కాస్త దూరంలో ఉన్నాడు. వీరి వెంట ఉన్న కుక్క ఏమాత్రం భయపడకుండా పెద్దగా మొరవడం మొదలుపెట్టింది. ''నా చేతులపై నిల్చుని పీకను కొరకడానికి ఉద్యుక్తురాలైన పులిని చూసి కుక్క పెద్దగా మొరగడం ప్రారంభించింది. దీంతో వెనుకంజ వేసిన పులి కొంతసేపు అలాగే చూస్తుండిపోయింది. నా ప్రాణాలు పోవడం ఖాయమనిపించింది. కుక్క హంగామాతో నా సోదరుడు, గ్రామస్థులు నన్ను కాపాడటానికి రావడంతో పులి అడవిలోకి పారిపోయింది'' అని గజ్బా వివరించారు. గజ్బా చేతులు, తలపై పెద్దగాయాలయ్యాయని సులియా చెప్పారు. కురాయిలోని ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించామన్నారు.


No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();