పెళ్లి చూడక ఏపీ సీఎం ప్రమాణ స్వీకారం లైవ్ చూశారు
ఒకవైపు వివాహ వేడుకలు, మరో వైపు జగన్ ప్రమాణ స్వీకారాన్ని అతిథులు, వైసీపీ అభిమానులు వీక్షించారు. - హుజూర్‌నగర్. వీరలోకివెళుతే సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఏపీ సీఎం ప్రమాణ స్వీకారాన్ని లైవ్ షో ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం ఓ ఫంక్షన్‌హాల్‌లో పట్టణానికి చెందిన ట్రాన్స్‌పోర్టు యజమాని బిల్లుపల్లి ఇంద్రారెడ్డి, రమాదేవిల కుమార్తె మంజుభార్గవి-ఫణీందర్‌రెడ్డిల వివాహం జరిగింది. ఉదయం 11 గంటల 13 నిమిషాలకు వివాహం జరగ్గా, అదే సమయంలో ఏపీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తిలకించేందుకు ఎల్‌ఈడీ స్ర్కీన్‌లో లైవ్ ఏర్పాటు చేశారు.
Post a Comment