Header Ads

తెలివైన కాకి

చక్కటి ఉపాయంతో కాపాడుకున్న కాకి కథ ఇప్పుడు చదువుకుందాం. నర్మదా నది తీరాన ఒక చెట్టుపై కాకి కుటుంబం నివసిస్తోంది. అది భార్య పిల్లలు అక్కడ హాయిగా ఉంటాయి. కానీ ఆ చెట్టు కింద పాము పుట్ట ఒకటి ఉంది. ఆ పాము పుట్టలో పాము వుంది. కాకి దంపతులు ఆహారంవెతుక్కునేందుకు వెళ్లగానే పాము నెమ్మదిగా చెట్టుపైకి ఎక్కి కాకి పెట్టే గుడ్లను తిని వేస్తుంది. ఆ పాము నుండి తమ గుడ్లను ఎలా కాపాడుకోవాలి అని అవి ఆలోచించాయి. వాటికి ఉపాయమేమీ తట్టలేదు.
చివరకు కాకి తన స్నేహితుడైన ఎలుకను ఉపాయం చెప్పమన్నది ఎలుక ఆలోచించి తన ఉపాయం చెప్పింది. మరునాడు ఆ కాకి రాజుగారి అంతపురం లోకి వెళ్ళింది. కొలనులో రాణి గారు ఆమె చెలికత్తెలతో స్నానాలు చేస్తున్నారు. వారు తమ బట్టలను గట్టున పెట్టారు. ఒక ముత్యాల హారం మాకున్న కరచుకొని ఎగిరింది. కాకి ముత్యాలహారం ముక్కున పట్టుకొని ఎగురుతుంది పట్టుకోండి అని రాణి గారు బయట కాపలా కాస్తున్న భటులను అజ్ఞాత పించారు. కాకి ని అనుసరించసాగారు. ఆకాశంలో కాకి ఎటు తిరిగితే దాన్ని వెంటబడే రాజాభటులు పరుగులు పెడుతున్నారు. కాకి ఎగిరి ఎగిరి వెళ్ళి తన గూడు చెట్టుపై వాలి, అటు ఇటు చూసింది. బట్టలు చెట్టుకింద నిలిచి పైకి చూస్తూ కాకిని ఆదిలేస్తున్నారు. అప్పుడు కాకి ఒడుపుగా ముత్యాలహారాన్ని చెట్టు క్రింద పుట్టలో వేసినట్లుగా వదిలింది. కారం పుట్టలో పడిపోవడం చూసి రాజభటులు  పుట్టాను
తవ్వసాగారు. కొంత తావేసరికి పాము బయటకు వచ్చింది. దానిని కర్రలతో బాధ చంపారు. తరువాత మరికొంత లోతు తవ్వగానే పుట్టలో ముత్యాల హారం కనిపించింది. భటులు  దానిని తీసుకొని వెళ్ళి రాణి గారికి ఇచ్చారు. కాకి తన కుటుంబానికి పామును ఇలా అపాయం లేని ఉపాయంతో సులభంగా చంపకలిగింది.
అందుచేత ఉపాయాన్ని మించిన అపాయం లేదు

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();