Header Ads

చేప వివేకం

 అనగనగా ఒక ఊరు. ఆ ఊరు వైపుల ఒక చెరువు ఉంది. ఆ చెరువులో సుమతి,కాలమతి,  మందమతి అనే మూడు చేపలు ఉండేవి. అవి ఎంతో స్నేహంగా ఉండేవి. ఆ సంవత్సరం ఎండా కాలంలో చెరువుల్లో నీళ్లు క్రమక్రమంగా తరిగిపోతున్నాయి మరికొంత కాలం ఉంటే చెరువు ఎండిపోయే ప్రమాదం ఉంది.
ఒకరోజు సుమతి, కలతిని,మందమతిని పిలిచి ఇలా అంది. ఈ సంవత్సరం ఎండలు మండిపోతున్నాయి. వానలు లేవు వడగాల్పులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు చెరువులో ఉన్న ఈ కొద్దిపాటి నీళ్లు కూడా ఇంకిపోయే ప్రమాదం ఉంది. అందుచేత మనం ముందే జాగ్రత్త పడాలి అని సుమతి చాప అంది. ఆలస్యం చేస్తే ముప్పు ముంచుకొస్తుంది. ఇక్కడ కొంతమంది జాలర్లు వచ్చి ఈ చెరువు గట్టు మీద నిలబడి మాట్లాడుకుంటే విన్నాను. ఇంకో 10 రోజుల్లో చెరువు ఎండిపోతుందని అప్పుడు వచ్చి చాపలను పట్టాలని వారు అనుకుంటున్నారు. ఈ మాటలు విన్నప్పటి నుంచి నాకు భయంగా ఉంది. మనం బ్రతికి బయట పడాలంటే ఒకటే మార్గం కనిపిస్తుంది. మన చెరువుకు సమీపంలోనే ఒక పెద్ద చెరువు ఉంది. అది ఎప్పుడు ఎండిపోదు. ఆ చెరువు నుంచి మనం నివసించే చెరువుకు ఒక కాలువ ఉంది ఆ కాలువలోని నీటి వెంట ఎదుర్కొంటూ ఆ చెరువులోకి వెళ్తే మనం అపాయం నుంచి తప్పించుకోవచ్చు అని సుమతి చాప అంది.
ఆ మాటలు విన్న కాలమతి మిత్రమా నువ్వు అనవసరంగా భయపడుతున్నావు దీనికి ఇంత విచారం ఎందుకు అపాయం వస్తే ఏదో ఒక ఉపాయంతో తప్పించుకోవచ్చు లే. అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మిత్రులు ఇద్దరు తన మాట విననందుకు సుమతి బాధపడింది. అదే ఆ రాత్రికి రాత్రే నేటి జల్లుకు ఎదుర్కొంటూ మరో చెరువుకు క్షేమంగా చేరుకుంది. పది రోజులు జరిగిపోయాయి ఆ చెరువు ఎండిపోతుంది ముందు అనుకున్నట్లే జాలర్లు వలలతో వచ్చారు. చాపలను ప్రతి తీరం మీదకి విసిరేయడం ప్రారంభించారు. కల మతి ప్రమాదాన్ని గ్రహించి గట్టుమీద పడడంతోనే కదలకుండా చచ్చి పోయినట్లు కొంది కొద్దిసేపటి తర్వాత గార్ల కన్నుగప్పి మళ్లీ నీటిలోకి జారుకుంది. కానీ మందమతి ఏమి చెయ్యాలో తోచలేదు గట్టు మీద పడిన తర్వాత ఎగిరి పడసాగింది. ఒక్కసారి జాలరి దానిని గట్టిగా పట్టి బుట్టలో పడేశాడు. దాని కదా అలా ముగిసిపోయింది.
కథలో నీతి: రాబోయే ఆపదను ముందుగా పసిగట్టి బయట పడే వాడు వివేకి. అలా కాకపోయినా సమయానికి ఉపాయంతో తప్పించుకునేవాడు బుద్ధిమంతుడు. ఈ రెండు విధాలుగా చేయలేని వారు మందమతి ల ఆపదలో చిక్కుకుంటారు మరియు వారి కథ ముగిసిపోతుంది. మనం ఇతరులు చెప్పిన మాటలు వినాల్సిందే.

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();