Header Ads

లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో దుండగులు చొరబడి

ఈ ఘటన అనంతపురం లో జరిగిది ప్రముఖ శ్రీ మధుగిరి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో శుక్రవారం అర్ధరాత్రి దుండగులు దోపిడీ చేసిన ఘటన శనివారం వెలుగు చూసింది. చిలమత్తూరు మండలం పరిధిలో సోమఘట్ట గ్రామం వద్ద ఉన్న శ్రీ మధుగిరి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో శుక్రవారం అర్థరాత్రి దుండగులు చొరబడి, ఆలయ పూజారిని బంధించారు. గుడి తలుపులను, హుండీ ని పగులకొట్టి దోపిడీ చేశారు. పూజారి భార్య వద్ద ఉన్న బంగారు నగలను, భార్యాభర్తలిద్దరి వద్ద ఉన్న సెల్‌ ఫోన్లను దోపిడీ చేశారు. విషయం తెలిసిన పోలీసులు శనివారం ఉదయం ఆలయ పరిసరాలన్నిటినీ పరిశీలించారు. ఈ సంఘటన పై పూజారి ని ప్రశ్నించగా.. రాత్రి 12 గంటల సమయంలో ఏడుగురు లేక ఎనిమిది మంది దుండగులు ఆలయంలో చొరబడి, తమను బెదిరించి ఈ దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. 

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();