ఎనర్జీ డ్రింక్స్ గూర్చి మీకు తెలుసా ఈ విషయము
ఎనర్జీ డ్రింక్స్... ఇటీవల వీటి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ డ్రింక్స్‌ని ఎక్కువగా తాగుతున్నారు. తక్షణం శక్తి పొందవచ్చనో లేదా స్టైల్‌గా భావించో చాలా మంది వీటిపైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎప్పుడో ఒకసారి వీటిని తీసుకుంటే ఫర్వాలేదు కానీ... అదే పనిగా తాగితే మాత్రం గుండె బేజారవుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎనర్జీ డ్రింక్స్ అతిగా తాగితే శరీరంలో రక్తపోటు స్థాయి విపరీతంగా పెరిగిపోయి హృదయ స్పందనల్లో తీవ్ర మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
Post a Comment