పెరుగుతున్న జింక జంతువుల సంచారం
ఓవైపు చుక్కనీరు దొరకక, మరోవైపు ఉచ్చులతో సిద్ధంగా ఉండే వేటగాళ్ల బారి నుంచి తప్పించుకోలేక తల్లడిల్లిపోయేవి. ఈ నేపథ్యంలో వీటి రక్షణకు అటవీ శాఖ చేస్తున్న కృషి ఫలిస్తోంది. అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు, సోలార్ పంపు సెట్లు, నీటి గుంతలు, తొట్ల ఏర్పాటు చేసి పటిష్ఠమైన చర్యలు తీసుకుంటుండటంతో క్రమక్రమంగా వాటి సంఖ్య పెరుగుతోంది. ఈ మేరకు ఏర్పాటు చేసిన కెమెరాల్లో అడవి దున్నలు, జింకలు, దుప్పుల వంటి వన్యప్రాణుల జాడ స్పష్టంగా కనిపిస్తోంది.స్ప్రింక్లర్ల సాయంతో..: అప్పరాజుపల్లి, గండిచెరువు, దొరవారితిమ్మాపురం సెక్షన్లలో వన్యప్రాణులకు గడ్డి విత్తనాలు చల్లి గ్రాసం అందించేలా ఏర్పాట్లు చేశారు. ఫలితంగా వేసవిలోనూ పుష్కలంగా పచ్చటి గడ్డి, తాగునీరు అందుతోంది. ముఖ్యంగా అప్పరాజుపల్లి సమ్మక్క సారలమ్మ గద్దెల సమీపంలో వట్టెవాగు ఉన్నా.. వేసవిలో చుక్కనీరు ఉండేది కాదు. ఇది గుర్తించిన యంత్రాంగం వాగు దగ్గర స్పింక్లర్ల సాయంతో గ్రాసం పెంచుతోంది.వేసవి వచ్చిందంటే వన్యప్రాణులకు ముప్పు అంతా ఇంతా కాదు.ఫలిస్తున్న అటవీశాఖ ప్రయత్నాలు.
Post a Comment