Header Ads

ఎస్‌బీఐ హెచ్చరికలు నోటిస్ వెంటనే చదవండి

1. అనుమానాస్పద ఇమెయిల్స్ ఓపెన్ చేయొద్దు. అందులో లింక్స్ అస్సలు క్లిక్ చేయకండి.
2. గూగుల్ ప్లే స్టోర్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక యాప్స్ మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి.3. లాటరీ తగిలిందని వచ్చే ఎస్ఎంఎశ్‌లను అస్సలు పట్టించుకోవద్దు.
4. సైబర్ నేరగాళ్లు బ్యాంకు నుంచి మెయిల్స్ పంపినట్టు మిమ్మల్ని నమ్మిస్తారు. మీ అకౌంట్ వివరాలు తెలపాలని కోరతారు. బ్యాంకులు మీ అకౌంట్ వివరాలు అడగవన్న విషయం గుర్తుంచుకోండి.
5. సైబర్ నేరగాళ్ల కాల్స్ విషయంలో జాగ్రత్త. బ్యాంకు మేనేజర్‌ను మాట్లాడుతున్నానని నమ్మిస్తారు కేటుగాళ్లు. బ్యాంకు ప్రతినిధులెవరూ మీ కార్డ్ నెంబర్లు, పిన్ నెంబర్లు అడగరు.
6. మీ అకౌంట్ వివరాలు చెప్తే అప్‌డేట్ చేస్తామని ఎవరైనా అడిగితే అనుమానించాల్సిందే. ఏదైనా ఉంటే బ్యాంకుకు వచ్చి అప్‌డేట్ చేస్తామని చెప్పండి. 7. కొత్త వర్షన్ బ్రౌజర్లు మాత్రమే ఉపయోగించండి. Google chrome, IE 7.0, Mozilla Firefox 3.1, Opera 9.5, Safari 3.5 వర్షన్ల కన్నా ఎక్కువ ఉండే బ్రౌజర్లే వాడాలి.
8.ఇంటర్నెట్ సెంటర్స్, అపరిచితుల కంప్యూటర్లల్లో అకౌంట్ లావాదేవీలు చేయకూడదు.
9. మీ అకౌంట్ పాస్‌వర్డ్స్, మీ కార్డుల పిన్ నెంబర్స్ తరచూ మారుస్తుండాలి.
10. మీ అకౌంట్ లాగిన్ వివరాలు చెక్ చేస్తూ ఉండాలి. ఏదైనా అనుమానంగా అనిపిస్తే బ్యాంకులో కంప్లైంట్ చేయాలి.
11. .మీ కంప్యూటర్‌ను రెగ్యులర్‌గా యాంటీవైరస్‌తో స్కాన్ చేస్తూ ఉండాలి.

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();