తెలుగు ప్రజలకు చల్లని కబురు ఏమిటో చూడండి
రుతుపవనాలు మూడు రోజుల ముందుగానే దక్షిణాదిని తాకనున్నాయన్నది ఆ కబురు. ఈ ప్రభావంతో ఈసారి త్వరగానే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అధికారులు చెప్పారు. జూన్ 6వ తేదీ నాటికి రుతుపవనాలు రానున్నాయని భావించినప్పటికీ అది కాస్తా ఇప్పుడు మరో మూడు రోజుల ముందుగానే, అంటే జూన్ 3వ తేదీ నాటికి రుతుపవనాలు దక్షిణాదిని పలకరిస్తాయని వాతావరణ శాఖ అంటోంది.వేసవి తాపంతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
Post a Comment