Header Ads

కుక్కపై అకారణంగా రాయితో దాడి చేసినందుకే

షేక్‌పేట సమీపంలోని మారుతీనగర్‌కు చెందిన శ్రీనివాస్‌ ఫిలింనగర్‌ రోడ్‌ నెంబర్‌-16లో కొబ్బరి బోండాలు విక్రయించేవాడుశ్రీనివాస్‌. అతడికి సంతానం లేకపోవడంతో ఓ వీధి కుక్కను చేరదీసి 'సాయి' అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. ప్రతిరోజూ తనతో పాటు దుకాణానికి తీసుకొచ్చేవాడు. ఆదివారం సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన చల్లా బాలసుబ్రహ్మణ్యం అనే యువకుడు శ్రీనివాస్‌ కొబ్బరి బోండాల బండి పక్క నుంచి వెళుతుండగా కుక్క అతడి వెంటపడటంతో రాయితో కొట్టాడు బాలసుబ్రహ్మణ్యం.దీంతో ఆగ్రహానికి లోనైన శ్రీనివాస్‌ చేతిలో ఉన్న కత్తితో అతడిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.బాధితుడి సోదరుడు చల్లా రాజ్‌కుమార్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.తన సాయిపెంపుడు కుక్కపై అకారణంగా రాయితో దాడి చేసినందుకే తాను తిరిగి దాడి చేసినట్లు నిందితుడు చెప్పాడు.
ఈ న్యూస్ సోషల్ మీడియా లో దుమారం రేపుతుంది.

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();