Header Ads

తన గేయం తనను గెలిపించిన ప్రజలకె అని చెప్పారు

 పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికైనప్పటికీ, ఢిల్లీకి పరిమితం కాకుండా తనను గెలిపించిన ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా సోమవారం ఒక ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను భారీ మెజారిటీతో గెలిపించిన పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయనని అన్నారు. ప్రజాసమస్యల పరి ష్కారానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. పార్లమెంట్‌ సభ్యుడిగా కాకుండా సామాన్య కార్యకర్తగా ప్ర జల్లోకి వెళ్లి పనిచేస్తానన్నారు. నిరుపేద ప్రజలకు అండగా నిలుస్తానని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉ న్నందున అధిక నిధులు తీసుకువచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచిం చారు. కేంద్ర సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందేవిధంగా కృషి చేస్తానని చెప్పారు బండి సంజయ్ కుమార్.అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌.
హిందూ ఏక్తా యాత్ర విజయవంతం చేయాలి అని అన్నారు. ఈనెల 29న సాయంత్రం 4 గంటలకు వైశ్యభవన్‌ నుంచి ప్రారంభమవుతుందన్నారు.



No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();