మనం తాగు నీటి ద్వారా వచ్చే వ్యాధులగురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే చూడండి ఫ్రెండ్స్
ఈ విషయం మీకు తెలుసా? మనకు సంక్రమించే వ్యాధులలో 80 శాతం నీటి కారణంగా వస్తాయంట నీటి ద్వారా వచ్చే వ్యాధులు, అందుకు కారణాలు మరియు నివారణ పద్ధతులకు సంబంధించిన సమాచారం ఇక్కడ ఇవ్వబడింది చూడండి ఫ్రెండ్స్.వాటి గురించి మీరు కొంత ప్రాథమిక సమాచారం తెలుసుకుంటే, అవి రాకుండా అడ్డుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది. కలుషితమైన, విషపూరితమైన నీరు మరియు సముద్రపు ఆహార పదార్ధాలను స్వీకరించడం ద్వారానే కలరా వ్యాపిస్తుంది. నీటిని మరగబెట్టడం/ కాచి వడబోయడం మరియు రివర్స్ ఆస్మోసిస్ (RO) వంటి ముందస్తు నివారణ పద్ధతులను పాటించాలి. శుభ్రత తక్కువగా ఉండే పరిసరాలలో ఈ వ్యాధి సహజంగా వ్యాపిస్తుంది. అలాగే తినేందుకు ముందే పండ్లు మరియు కూరగాయలను శుభ్రంగా కడగండి.క్రిములు సంక్రమించిన ఆహారం మరియు నీటిని తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
Post a Comment