'డ్రోన్'వార్ గుర్రపు డెక్కు
దోమ.. పేరుకు చిరు ప్రాణే కావచ్చు.. కానీ గ్రేటర్ నగరాన్ని గడగడలాడిస్తోంది. మురికి కాల్వలు, గుర్రపు డెక్కు ఉన్న చెరువుల్లో దాక్కుని నగరంపై దాడిచేస్తోంది. డెంగీ, మలేరియా వంటి విష జ్వరాలను విస్తరిస్తున్న ఈ ప్రాణి బెడదను వదిలించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతంత మాత్రమే ఫలితాన్నిచ్చాయి. దీంతో మూడు నెలల క్రితం జీహెచ్‌ఎంసీ దేశంలోనే తొలిసారి ప్రయోగాత్మకంగా చేపట్టిన 'డ్రోన్' వార్ విజయవంతం కావడంతో గ్రేటర్‌లోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో సర్జికల్ స్ట్రయిక్ చేయాలని నిర్ణయించారు.దోమల నివారణకు వినియోగిస్తున్న డ్రోన్ల సృష్టికర్త బాలాపూర్‌కు చెందిన ప్రేమ్‌కుమార్ విస్లావత్. ఐఐటీ గౌహతిలో బీటెక్ ఈసీఈ పూర్తిచేసిన ఈయన టీ-హబ్ సహకారం తీసుకుని, మరో ఇద్దరు మిత్రుల సహకారంతో మారుత్ డ్రోన్స్ సంస్థను నెలకొల్పారు. ఇందులో దోమల నివారణకు, వ్యవసాయానికి ఉపయోగపడేలా రెండు రకాల డ్రోన్‌లను తయారు చేశారు. ప్రస్తుతం డ్రోన్లకు గల 15 లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్‌లో మందును నింపి చెరువుల్లోని దోమలపై పిచికారీ చేస్తున్నారు.
Post a Comment