పాపం ఒకేసారి 650 కోళ్లు మృత్యువాత
ఇటీవల జూపాడుబంగ్లా మండలంలో వడదెబ్బతో ఏడేళ్ల బాలుడు, మరో ఉపాధి కూలీ మృతి చెందారు.కర్నూలు జిల్లాలో 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. బుధవారం జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలో రైతు సతీష్‌రెడ్డికి చెందిన 650 కోళ్లు మృత్యువాత పడ్డాయి.డదెబ్బ ధాటికి పక్షులు, పశువులు, మనుషులు పిట్టల్లా రాలుతున్న పరిస్థితి.ఈ ఘటనతో రూ.2 లక్షల దాకా నష్టం సంభవించింది. వేసవిలో విద్యుత్ బిల్లులు అధికంగా రావడం, కోళ్ల బరువు తగ్గడం, ఎండలకు కోళ్లు మృత్యువాత పడడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.వేడిగాల్పుల తీవ్రతకు కోళ్లు కూడా అల్లాడుతున్నాయి.
Post a Comment