తెలంగాణ -ప్రపంచంలోనే 3వ స్థానం -ప్రపంచ రికార్డు ఎండ
ఎండల గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో తెలంగాణ -ప్రపంచంలోనే 3వ స్థానం -ప్రపంచ రికార్డు ఎండ -దేశంలోనే జగిత్యాల జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత -ధర్మపురి మండలం జైనా గ్రామంలో 47.5 డిగ్రీలు -రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బతో 26 మంది మృతి -తెలంగాణలో 11 పాయింట్లు దాటి నమోదు -రాగల మూడురోజుల్లో అక్కడక్కడ వానలు -47.5 డిగ్రీల ఉష్ణోగ్రతతో మండిపోయిన ధర్మపురి మండలం జైనా గ్రామం తెలంగాణ: రాష్ట్రంలో రికార్డుస్థాయిలో ఎండలు మండుతున్నాయి. ఆదిలాబాద్‌లో 46.3 డిగ్రీలు, నిజామాబాద్‌లో 45.7, హన్మకొండలో 45.8, రా మగుండంలో 45.2, నల్లగొండలో 45.8, ఖమ్మంలో 43.6, భద్రాచలంలో 43, హైదరాబాద్‌లో 41.8, మె దక్‌లో 44.8, మహబూబ్‌నగర్ 43.1 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో వడగాలుల తీవ్రత కొనసాగే అవకాశముందని వెల్లడించారు. బుధవారం వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా 26 మంది మృతిచెందారు.మరో వారంవరకు చాలాచోట్ల వడగాడ్పులతీవ్రతఉంటుందని,ప్రజలుఅప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు.
అదీ మామూలు రికార్డు కాదు.. ప్రపంచస్థాయి రికార్డుల్లో! దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతంలో జగిత్యాల అగ్రభాగాన నిలిచింది.
అదీ మామూలు రికార్డు కాదు.. ప్రపంచస్థాయి రికార్డుల్లో! దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతంలో జగిత్యాల అగ్రభాగాన నిలిచింది.
Post a Comment