Header Ads

నీళ్లు లేక కోళ్లు మృత్యువాతపడ్డాయని రైతు

ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం అవుసులకుంట తండాలో సోమవారం చోటుచేసుకున్నది.  విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతో తండాకు మూడు రోజులుగా కరెంట్ నిలిచిపోయింది.  దీంతో దూర ప్రాంతాల నుంచి ట్యాంకర్లలో నీళ్లు తెచ్చి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించక ఫారంంలోని నాలుగు వేల కోళ్లు మృత్యువాతపడ్డాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన మూడు చక్రూనాయక్ కోళ్ల ఫారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఈదురు గాలుల కారణంగా తండాలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి కరంటు సరఫరా నిలిచిపోయింది.సుమారు రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లినట్టు వారు తెలిపారు.మూడు రోజులుగా నీళ్లు లేక పౌల్ట్రీఫారంలోని నాలుగు వేల కోళ్లు మృత్యువాతపడ్డాయి.



No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();