టమాట ధరకు రెక్కలు వెజిట్రబుల్స్ ధరలు వింటే షాక్
ఎండాకాలం వలన నీటి కొరత వలన పంట దిగుబడి తగ్గిందని చెబుతున్నారు.. మార్కెట్‌కు రావాలంటేనే భయపడాల్సి వస్తుందని, కూరగాయల ధరలు తగ్గించాలని కోరుతున్నారు.. మార్కెట్‌కు రావాలంటేనే భయపడాల్సి వస్తుందని, కూరగాయల ధరలు తగ్గించాలని కోరుతున్నారు.కూరగాయల రేట్లు అధికంగా వుండటంపై కొనుగోలు దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏప్రిల్ మొదటి వారంలో 15 నుండి 18 రూపాయల మధ్య వున్న టమాట ధరకు ఇపుడు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం ఏకంగా 60 రూపాయలకు చేరింది. పచ్చిమిర్చి ధర కిలో 70 రూపాయలు పలుకుతుంటే... వంకాయ, బెండకాయలు 50 రూపాయలుగా ఉన్నాయి. అటు.. ఆకు కూరల రేట్లు కూడా అధికంగానే వున్నాయి. హైదరాబాద్‌లో ఎండలతోపాటు కూరగాయల ధరలు కూడా మండిపోతున్నాయి. నీటి కొరతతో కూరగాయల దిగుబడి తగ్గింది.
Post a Comment