తీరని ఆకలి కోరిక
ఒక గ్రామంలో సోమయ్య అనే హాలికుడు ఉండేవాడు. అతని భార్య సూర్యకాంతం. సోమయ్య పగలంతా పొలంలో కష్టపడి పని చేసేవాడు. ఒకరోజు సోమయ్యకు జంతికలు తినాలని కోరిక కలిగింది. అతడు తన ఇల్లాలిని పిలిచి నేని రోజు సెనగ పిండి, బియ్యపు పిండి, నూనె, కారప్పొడి తెచ్చి ఇస్తాను. రేపు నాకు జంతికలు చేసి పెట్టు. తినాలని కోరిక తీవ్రంగా ఉంది అన్నాడు. అట్లాగే అంది సూర్యకాంతం. ఆ రోజు సాయంత్రం సోమయ్య సరుకులని తెచ్చి భార్యకు ఇచ్చాడు. ఉదయాన్నే లేచి పొలానికి వెళ్లి సాయంకాలం నాలుగు గంటలకు ఇంటికి వస్తాను. జంతికలు చేసి ఉంచు. అని భోజన పెట్టెను పట్టుకొని పొలానికి వెళ్ళాడు. సూర్యకాంతం మధ్యాహ్నం పొయ్యి వెలిగించింది. జంతికలు చేస్తూ రుచి చూద్దామని ఒకటి నోట్లో వేసుకుంది. జంతికలు కర కర నములుతూ రుచిగా ఉన్నాయి అని ఇంకోటి తుంచి ఆరగించింది. సాయంత్రం 4:00గం|| అవుతుంది. సోమయ్య గృహానికి వచ్చాడు. కాళ్లు చేతులు కట్టుకున్నాడు. వంట గదిలో పీట వేసుకుని కూర్చొని ఎన్ని జంతికలు చేశావ్? అంటూ సూర్యకాంతాన్ని ప్రశ్నించాడు.20 జంతికలు సూర్యకాంతం చేశానని చెప్పింది. 4జంతికలు పళ్లెంలో పెట్టి తీసుకో రా అన్నాడు సోమయ్య. ఆ వస్తున్న అంటూ సూర్యకాంతం ఒక జంతికలు పాలెం లో నుంచి సోమయ్య ముందు పెట్టింది. ఇదేమిటి నాలుగు అడిగితే 1 తెచ్చావ్ అని చిరాకు పడ్డాడు సోమయ్య. ఏవండీ! జంతికలు చేస్తూ రుచిగా ఉన్నాయి అని మిగిలినవన్నీ తినేశాను, మెల్లగా చెప్పింది సూర్యకాంతం. అన్ని ఎలా తిన్నావ్ అడిగాడు సోమయ్య. వెంటనే సూర్యకాంతం పల్లంలో ఉన్న ఒక జంతికలు నోట్లో వేసుకొని కరకర నమిలి వేసింది, ఇట్ల తిన్నాను అన్నది. పాపం సోమయ్యకు 1టి దక్కలేదు నిట్టూర్పు విడుస్తూ లేచాడు.
పాపం ఒక్కడి తినకుండా వెళ్ళిపోయాడు. సూర్యకాంతం సోమయ్య ముఖం చూస్తూ నవ్వసాగింది.
ఈ కథ కేవలం కల్పితం మాత్రమే హాస్యం కోసం.
పాపం ఒక్కడి తినకుండా వెళ్ళిపోయాడు. సూర్యకాంతం సోమయ్య ముఖం చూస్తూ నవ్వసాగింది.ఈ కథ కేవలం కల్పితం మాత్రమే హాస్యం కోసం.
Post a Comment