Header Ads

తాటి చెట్టు గురించి మీకు తెలుసా ?

మన చుట్టూ ఉండే పరిసరాల్లో ఎన్నో రకాల చెట్లు కనిపిస్తుంటాయి. ఈ చెట్లన్నీ మనకు ఏదో విధంగా మేలు చేస్తాయి. కొన్ని చెట్లు మాత్రం పండ్ల ఇస్తాయి. కొన్ని చెట్లు పూలు ఇస్తాయి. కొన్ని చెట్లు కూరగాయలు ఇస్తాయి. కొన్ని కలప నిస్తాయి. అయితే కొన్ని చెట్లు మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. అలాంటి చెట్లలో ముఖ్యమైనది తాటి చెట్టు. తాటి చెట్టు ఎత్తుగా పెరుగుతుంది. దీనికి ఆకులు ఉంటాయి కానీ కొమ్ములుండవు. దీని ఆకులు విసనకర్రల ఆకారంలో విశాలంగా ఉంటాయి ఎండాకాలంలో తాటి చెట్టు కు కాయలు కాస్తాయి. తాటి కాయ లో ఉండే ముంజలు మధురంగా ఉంటాయి. చాలామంది తాటి ముంజలను ఎంతో ఇష్టంగా తింటారు. ముంజలు తిని వేసిన తర్వాత తాటికాయల కు రంధ్రాలు చేసి కర్రె లకు చెక్ రాలుగా చేసి సౌకర్యంగా గుచ్చి పిల్లలు ఆడుకుంటారు. తాటి తండ్రా తియ్యగా ఉంటుంది. దీనిని బాగా మగ్గిన తాటి పండ్లు నుంచి తయారు చేస్తారు. తాటి పండ్లను నేలలో పాతిపెడితే మొక్కలు వస్తాయి. ఆ మొక్కలను తీగలు అంటారు. ఈ తీగలు ఉడికించుకొని తింటే బాగుంటాయి. తాటి పాల నుంచి తాటి బెల్లం తాటి కలకండ తయారు చేసుకోవచ్చు. పూర్వకాలంలో తాటాకులతో గొడుగులు, గుడాలు తయారు చేసేవారు. వాటిని వానాకాలంలో వర్షాల్లో తడవకుండా ఉండేందుకు ఉపయోగించేవారు. తాటి ఆకులతో విసనకర్రలు చాపలు బుట్టలు బొమ్మలు మొదలైన రకరకాల వస్తువులు చేస్తారు. ఇప్పుడు మనం ఉపయోగించే కాగితం లేని రోజుల్లో పుస్తకాల్లో తాటి ఆకుల మీద గంటలతో రాసేవాళ్లు. వాటిని తాళపత్ర గ్రంథాలు అంటారు. పల్లెటూరు లో ఉండే ప్రజలు పేదవాళ్లు కదా! వాళ్లు ధనవంతుడులాగా మెడలో ఉండరు. తమకు దొరికే వస్తువులతో పాకలు గుడిసెలు నిర్మించుకుని అందులో నివసిస్తారు. ఈ పాకలు గుడిసెలు కట్టడంతో తాటి దూలాలు ఇళ్ల కాపులకు తాటి ఆకు కు వాడతారు. తాటాకులతో వెరైటీలు దాడులు కడతారు. చిన్న చిన్న వాగులు కాలువలు ఉంటాయి కదా! వాటిని దాటడానికి వంతెనలు ఉండవు. పడిపోయిన 2 తాడి చెట్లను కాలువకు అడ్డంగా వేస్తే అదే వంతెన అవుతుంది. పొలాలకు బావుల నుంచి నీళ్లు తోడి ముల్లు కూడా తాటి దూలాల తోనే తయారు చేస్తారు. తాటి చెట్టు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుం దో చూశారు కదా! అందుకే తాటిచెట్టును పేదల పాలిట కల్పవృక్షం అంటారు.

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();